తెలంగాణలో హోలీ సంబరాలు

తెలంగాణలో హోలీ సంబరాలు

01-03-2018

తెలంగాణలో హోలీ సంబరాలు

రంగుల పండుగ హోలీ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాలో చిన్నారులు, పెద్దలు, యువకులు ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. పాలకుర్తి మండలంలో శాతాపురంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు హోలీ జరుపుకున్నారు. అనంతరం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మదాపురం శివారు దేవునీగుట్ట తండాలో గిరిజనులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ ప్రజలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మంథనిలో ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ మల్లారెడ్డి తన కార్యాలయంలో అనుచరులు, ప్రజలతో కలిసి హోలిని సెలబ్రేట్‌ చేసుకున్నారు.