వివిధ రూట్లలో టూర్ కారిడార్

వివిధ రూట్లలో టూర్ కారిడార్

13-03-2017

వివిధ రూట్లలో టూర్ కారిడార్

రాష్ట్రంలో  ప్రముఖ నగరాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించే వివిధ టూర్‌ కారిడార్‌లను ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం రూపొందించింది. శ్రీశైలం శ్రీకాళహస్తి కారిడార్‌లో 7 ప్రాంతాలు,  విశాఖపట్నం కారిడార్‌లో 7 ఆధ్మాత్మిక ప్రాంతాలు, రాజమండ్రి కారిడార్‌లో  5 ప్రాంతాలను విజయవాడ కారిడార్‌లో 5 ప్రాంతాలను టూరిస్ట్‌లు సందర్శించవచ్చు. అలాగే త్రిలింగ యాత్ర, ఏపీ గోల్డెన్‌  ట్రయాంగిల్‌, అష్టశక్తి యాత్రలను ప్రత్యేకంగా తెలుగు ప్రజలు, మహిళలకోసం రూపొందించారు. చారిత్రాత్మకంగా విజయనగర, కాకతీయ, కళింగ రాజ్యాలకు తెలుగు ప్రజలు వారసులు. కానుగుణంగా వచ్చిన ప్రాంతాల విభజనలో ఈ మూడు రాజ్యాల రాజధానులు ఇతర రాష్ట్రాలోకి వెళ్లాయి.

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ రాజ్యాల రాజలు ప్రసిద్ధిగాంచిన దేవాలయాలను ఆ రోజుల్లో ఎంతో వైభవంగా నిర్మించారు. వాటి ప్రాముఖ్యతను తెలుసుకునే విధంగా  హంపి, తిరుపతి మధ్య విజయనగర కారిడార్‌, సింహాచలం ఒరిసా మధ్య కళింగ కారిడార్‌ రూపొందించారు. దక్షిణ భారత దేశంలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు,  ముంబాయ్‌ తదితర ప్రాంతాల నుంచి టూర్‌ ఆపరేటర్‌లు ఈ కారిడార్‌లకు ట్రావెల్స్‌ను నడుపుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. దేశ, విదేశాల నుంచి  పర్యాటకులను ఆకర్షించేలా ఆధ్యాత్మిక  టూర్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై సరైన ప్రణాళికలతోనే ముందుకు వెళుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కేవలం పండుగల సమయాల్లోనే ఆలయాల దర్శనానికి ఆసక్తి చూపుతున్న ప్రజల్లో వివిధ మాధ్యమాల, ప్రకటణల ద్వారా చైతన్యం తీసుకువచ్చి ఏడాది పొడవునా ఆలయాలను దర్శించేలా టూర్‌ కారిడార్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వం విజయవంతమైందని చెప్పవచ్చు.