ఈ నెల 15న ఏపీ బడ్జెట్!
APEDB
Ramakrishna

ఈ నెల 15న ఏపీ బడ్జెట్!

13-03-2017

ఈ నెల 15న ఏపీ బడ్జెట్!

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ శాసనసభ, శాసనమండలిలో ఈనెల 15న ప్రవేశపెట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు నేడు సభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉండగా, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో వాయిదాపడింది. నేడు ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు శాననసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశమవుతాయి. నాగిరెడ్డి మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తాయి. అనంతరం ఉభయ సభలు వాయిదాపడాతాయి. శాననసభ, మండలిలో రాష్ట్ర బడ్జెట్‌ ఫలానా తేదీన ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాక, అది వాయిదపడడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించటంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాలనుకన్న రోజున సెలవు ప్రకటాంచాల్సి వచ్చింది. గవర్నర్‌ అనుమతితో 15న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.