29 రాష్ట్రాలలో ఏపీ టాప్ ప్లేస్

29 రాష్ట్రాలలో ఏపీ టాప్ ప్లేస్

14-02-2018

29 రాష్ట్రాలలో ఏపీ టాప్ ప్లేస్

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై ప్రపంచంలోని అన్ని దేశాలకు ర్యాంకులను కేటాయించే పద్దతి ఎప్పటి నుంచో అమలు చేస్తోంది ప్రపంచ బ్యాంకు. దాని అంచనాల ప్రకారం ఇండియాలోని 29 రాష్ట్రాలలో ఏపీ టాప్‌ ప్లేస్‌ వచ్చేసింది. గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాల వ్యాపారాలను తలదన్నేలా ఏపీ ఎదుగుతోంది. అదే సమయంలో ఫిబ్రవరి 24 నుంచి 26వరకు విశాఖలో ఏపీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సదస్సు జరగనుంది. అందుకోసమే ఇటీవల సి.ఎం చంద్రబాబునాయుడు ఒక్క రోజు పర్యటన కోసం యుఏఈకి వెళ్లి వచ్చారు. అక్కడ జరిగిన సదస్సులోను మాట్లాడారు. ఈ సదస్సుకు వేలాదిగా పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ విచ్చేయనున్నారు. కీలక సమయంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులను ప్రకటించడం ఏపీకి వరంగా మారనుంది. పెట్టుబడులు మరింత పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది.