కలిగిరిలో వైయస్ జగన్ బహిరంగ సభ ముఖ్యాంశాలు

కలిగిరిలో వైయస్ జగన్ బహిరంగ సభ ముఖ్యాంశాలు

13-02-2018

కలిగిరిలో వైయస్ జగన్ బహిరంగ సభ ముఖ్యాంశాలు

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరిలో బహిరంగ సభ ప్రారంభమైంది. ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో కలిగిరి పొట్టేత్తింది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తున్నారు.

* కలిగిరి బహిరంగ సభలో ఎంపీల రాజీనామాలపై ప్రకటించిన శ్రీ వైయస్ జగన్.
* ప్రత్యేక హోదా సంజీవని అని స్పష్టం చేసిన శ్రీ వైయస్ జగన్. కేంద్రం దిగివచ్చేవరకు హోదా కోసం పోరాటం చేస్తామన్న శ్రీ వైయస్ జగన్
* మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు హోదా కోసం పార్లమెంట్ లో పోరాడుతాం.
* ఆలోగా హోదా పరిష్కారం కాకుంటే.. ఏప్రిల్ 6న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించిన శ్రీ వైయస్ జగన్.
- మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. మరి, ఈ నాలుగేళ్ల బాబు పాలనతో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?
- దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. 
- రేషన్ షాపుల్లోనూ బియ్యం తప్ప నిత్యావసర వస్తువులు ఏవీ ఇవ్వటం లేదు.  అందులోనూ వేలిముద్రలు పడటం లేదని ఒకరిద్దరికి ఎగనామం పెడుతున్నారు. 
- నాలుగేళ్ల క్రితం బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, కిరోసిన్ కేవలం రూ.185లకే ఇచ్చేవారు. 
- నాలుగేళ్ల క్రితం రూ.50నుంచి రూ.150 లోపు కరెంటు బిల్లులు వచ్చేవి. కానీ ఇప్పుడు రూ.500 నుంచి రూ.1000 పైనే వస్తున్నాయి. 
- చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడుసార్లు కరెంటు బిల్లులు పెంచి మనకు షాకులు కొట్టిస్తున్నారు. 
- మూడుసార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. 
- మద్యాన్ని తగ్గిస్తాను, బెల్ట్ షాపులు తగ్గిస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ లేదు గానీ, బెల్ట్ షాపు మాత్రం కనిపిస్తోంది. 

- ఫోన్ కొడితే మద్యం తెచ్చి ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 
- బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరుతుగా మాఫీ కావాలంటేబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల వాళ్లు వేలం నోటీసులు పంపిస్తున్నారు. రుణ మాఫీ పథకం కనీసం వడ్డీలకు కూడా చాలటం లేదు. 

- రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రైతులకు వడ్డీలు లేని రుణాలు వచ్చేవి. ప్రభుత్వాలు రైతులకు సంబంధించి వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టేవి. బ్యాంకులు రైతులకు, అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేవి. 

- చంద్రబాబు బ్యాంకులకు వడ్డీ సొమ్ము కట్టడం మానేశారు. దీంతో, బ్యాంకులు వడ్డీ సొమ్మును ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. 
- పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. వారికి ఒక్క రూపాయి అయినా మాఫీ చేయలేదు. 
- యువతను కూడా బాబు మోసం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలని మోసం చేశారు. కనీసం నిరుద్యోగ భ)తి కూడా ఇవ్వలేదు. 

- చంద్రబాబు మాదిగ సోదరులను కూడా మోసం చేశారు. బాబు చెప్పులు కుట్టారు. దండోరా వేశారు. ఎన్నికల తర్వాత ఒక పథకంతో మోసం చేశారు. రాష్ట్రం పరిధిలో ఏముంటుంది. కేంద్రం పరిధిలో ఏముంటుందో చంద్రబాబుకు తెల్సు. ప్రతి కులాన్నీ ఎస్సీ,  ఎస్టీలుగా చేసేస్తామని వాగ్ధానాలు చేశారు. అది కేంద్రం పరిధి అని బాబు ఇప్పుడు చెబుతున్నారు. 

- ప్రతి కులాన్నీ చంద్రబాబు మోసం చేశారు. మేనిఫెస్టోలో ప్రతి కులానికీ ఓ పేజీ పెట్టారు. 
- రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని చెబితే..ఫలానిది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. 

- ఎన్నికల్లో ప్రజలు నమ్మరని బాబు కేజీ బంగారం, బెంజ్ కార్ ఇస్తామంటారు. ప్రజలు నమ్మరని ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేలు పెడతారు. వద్దు అనొద్దు. మూడు వేలు ఏంది.. అయిదువేలు అని గుంజండి. ప్రజల్ని దోచేసిన డబ్బే అదంతా. ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండని శ్రీ వైయస్ జగన్ కోరారు. 

- ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు మెట్ట ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు నీరు కావాలని తపన పడ్డవారు దివంగత నేత వైయస్ఆరే. నాన్నగారి హయాంలో సోమశిల హైలెవల్ కెనాల్ తీసుకురావాలని చెప్పి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని వైయస్ఆర్ నడుం బిగించారు. ఈ పనులు పూరైతే 90వేల ఎకరాలకు మేలు జరిగేది. ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందేది. 

- నాన్నగారి హయాంలో ప్రారంభమైన పనులు ఎక్కడేసిన గొంగళిలా అక్కడే ఉన్నాయి. సోమశిల ఉత్తర కాల్వలో నీళ్లు రావటం లేదని రైతులు వాపోతున్నారు. 

-ఈ నియోజకవర్గంలోని వింజమూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లో రైతులకు సాగు, తాగు నీరు అందేది. వైయస్ఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు. 

- వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 43.5 టీఎంసీల నీటిని తీసుకు రావాలని వైయస్ఆర్ ఆరాటపడ్డారు. అది పూర్తైతే తాగు, సాగు నీరు అందేది. 
- వెలుగొండ ప్రాజెక్టులో రెండు సొరంగాలు తవ్వితే శ్రీశైలం నుంచి నీరు తీసుకురావొచ్చనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ తట్టలేదు. 
- వైయస్ఆర్ హయాంలోనే చాలా వరకు పనులు పూర్తయ్యాయి. బాబు వచ్చి నాలుగేళ్లలో రెండు, మూడు కి.మీ కూడా తవ్వలేదు. 
- పొగాకు రైతులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. నేను వచ్చి ధర కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. 
- ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించాను. 
- టొబాకో బోర్డు బ్యారెల్ రూ.10 లక్షలు ఇచ్చి కొనుగోలు చేయాలి. లేకపోతే గిట్టుబాటు ధర కేజీకి రూ.150 ఇచ్చి కొనుగోలు చేయాలి. రెండూ.. జరగని పరిస్థితిలో ఉంది. 

- ప్రకాశం జిల్లాలోనూ, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంది. కెనాల్స్ ద్వారా నీరు తీసుకు వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. 

- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకముందే (2 7.01. 2017) మనమే ఎక్కువ సాధించామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 
- ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. కానీ, ప్యాకేజీ కోసం తన కమీషన్ల కోసం హోదాను చంద్రబాబు అమ్మేశారు. 
- ప్యాకేజీ కంటే హోదా వల్ల జరిగే మేలు ఏంటని జూన్ 6, 2017న చంద్రబాబు ప్రశ్నించారు. అందరి కంటే సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు..మోసపూరిత హామీలు ఇచ్చారు.

Click here for Photogallery