రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర

12-02-2018

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర

స్వాతంత్య్రం కోసం పోరాడటం గత చరిత్ర అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఉభయసభల్లో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఎంపీలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్నివిధాల సహకరించామని, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు తదితర అంశాలలో అండగా నిలిచామన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం మరింత సహకారం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. ప్రతిపక్షం లేఖల ద్వారా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబడిన కేంద్రమంత్రిపై ఫిర్యాదులు శోచనీమయని, ఉపాధి నిధులపై ఫిర్యాదులు, ప్రతిపక్షం అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. నేటి నుంచి 116 రోజులు జలసంరక్షణ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండో దశ జల సంరక్షణ ఉద్యమాన్ని విజయవంతం చేస్తూ చెరువుల్లో పూడికతీత, ముళ్లకంపల తొలగింపు పనులు ముమ్మరంగా చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి వర్షపు చుక్కను సద్వినియోగం చేసుకోవాలని, రబీ పంట రుణాల లక్ష్యంగా 76 శాతం చేరుకున్నామన్నారు.