ఏపీకి ఏం చేస్తారో చెప్పలేదు

ఏపీకి ఏం చేస్తారో చెప్పలేదు

09-02-2018

ఏపీకి ఏం చేస్తారో చెప్పలేదు

రాజకీయ ప్రత్యర్థుల మీద విషం కక్కడానికే ప్రధాని మోదీ పార్లమెంట్‌ను ఉపయోగించుకుంటున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు కశ్మీర్‌ విషయంలో సర్దార్‌ పటేల్‌కు తెలియకుండా నెహ్రూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ, ఏపీకి బడ్జెట్‌లో కేంద్ర అన్యాయం చేసిందన్నారు. మోదీ తన ఉపన్యాసంలో ఏపీకి ఏమి చేస్తారో చెప్పలేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రకటనల పోరాటం తారాస్థాయికి చేరిందని అన్నారు. వ్యక్తిగత దూషణలు చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలను కేసీఆర్‌ ప్రారంభించారన్నారు. విధానపరమైన విమర్శలకే పరిమితం కావాలని అన్నారు.