దాని కోసమే మన పోరాటం : చంద్రబాబు

దాని కోసమే మన పోరాటం : చంద్రబాబు

08-02-2018

దాని కోసమే మన పోరాటం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ధర్మపోరాటమనే విషయాన్ని కేంద్రానికి తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దుబాయ్‌ నుంచి ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పెట్టారని ప్రధాని మోదీ చెప్పినందున,  దాని కోసమే మన పోరాటమన్న సృష్టతతో ముందుకు సాగాలని సూచించారు. పార్లమెంటులో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని సృష్టం చేశారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనంగా ఉన్నప్పుడు పోరాడాల్సిందేనని వ్యాఖ్యానించారు. విభజనకు లేని ఫార్మూలా, లోటు బడ్జెట్‌ భర్తీకి కావాలా? అని ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీలకు వివరించాలని ఎంపీలకు సూచించారు. ఏపీకి ఏ విధంగా అన్యాయం జరిగిందో ఎంపీలందరికీ బుక్‌లెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా 2-3 గంటలు చర్చ జరగాలని, చేసే న్యాయంపై నిర్ణయం ప్రకటించే వరకూ పోరాటం ఆపవద్దని తెలిపారు.