రాహుల్ నాకు కూడా బాసే : సోనియాగాంధీ

రాహుల్ నాకు కూడా బాసే : సోనియాగాంధీ

08-02-2018

రాహుల్ నాకు కూడా బాసే :  సోనియాగాంధీ

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు కూడా బాసేనని ఆ పార్టీ మాజీ చీఫ్‌ సోనియాగాంధీ సృష్టం చేశారు. తనకు సహకరించినట్లుగానే  పార్టీ శ్రేణులు రాహుల్‌కు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గతేడాది డిసెంబర్‌లో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహులు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. తల్లి సోనియా నుంచి ఆయన పార్టీ పగ్గాలు స్వీకరించినప్పటికీ, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా సోనియానే కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా బీజెపీకి వ్యతిరేకంగా ఎన్‌డియేతర పార్టీలను కూడగట్టడమే తన లక్ష్యం అని ఆమె సృష్టం చేశారు. 2004లో వచ్చిన విధంగానే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.