లోక్ సభలో టీడీపీ ఎంపీల ఆందోళన

లోక్ సభలో టీడీపీ ఎంపీల ఆందోళన

08-02-2018

లోక్ సభలో టీడీపీ ఎంపీల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం ఎంపీలు పోరు మరింత ఉధృతం చేశారు. వరుసగా నాలుగోరోజు లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశ ఎంపీలు, గేట్‌ -1 వైకాపా ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.