ఏపీ బంద్ లో టీఆర్ఎస్ నేత!

ఏపీ బంద్ లో టీఆర్ఎస్ నేత!

08-02-2018

ఏపీ బంద్ లో టీఆర్ఎస్ నేత!

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వామపక్షాలు నేడు ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బంద్‌ విజయవంతమైంది. విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ సంఘీభావం తెలిపారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై తలపెట్టిన పోరాటానికి తెలంగాణ ఎంపీలను కూడా మద్దతు తెలపమని కోరతామని అదినారాయణ చెప్పారు.