సోనియాను కలిసిన టీడీపీ ఎంపీలు

సోనియాను కలిసిన టీడీపీ ఎంపీలు

08-02-2018

సోనియాను కలిసిన టీడీపీ ఎంపీలు

తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు, లోక్‌సభలో సోనియా గాంధీతో పాటు జ్యోతిరాదిత్యలను కలిసారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వారు సోనియాకు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని వారు పేర్కొన్నారు. ఏపీకి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని సోనియా వారికి హామీ ఇచ్చారు.