పవన్ పోరాటం చేస్తే.. రావడానికి నేను సిద్ధం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

పవన్ పోరాటం చేస్తే.. రావడానికి నేను సిద్ధం

08-02-2018

పవన్ పోరాటం చేస్తే.. రావడానికి నేను సిద్ధం

విజయవాడలో బంద్‌ కొనసాగుతోంది. లెనిన్‌ సెంటర్‌లో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో కత్తి మహేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్‌ పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. ఏపీ ప్రజలంటే బీజేపీకి ఎలా కనిపిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అసమర్థ వైఖరి వల్లే బడ్జెట్లో కేంద్రం తెలుగు ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీని విస్మరించడం దారుణమని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ బంద్‌కి మద్దతు ప్రకటించడం అభినందనీయమని, ఆయన ప్రజల్లోకి రావాలని కోరారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటానికి సినీపరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ఉద్యమంలోకి రావాలా వద్దా అనేది వారి వ్యక్తిగత విషయం అని అన్నారు. అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.