ఆయన లేనిలోటు పూడ్చలేనిది : చంద్రబాబు

ఆయన లేనిలోటు పూడ్చలేనిది : చంద్రబాబు

08-02-2018

ఆయన లేనిలోటు పూడ్చలేనిది : చంద్రబాబు

ముద్దుకృష్ణమ నాయుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన లేనిలోటు ఎవ్వరూ పూడ్చలేనిది. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారా నిజమైన నివాళి తెలుపుదాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో మంగళవారం అర్థరాత్రి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందాడు. బుధవారం మద్యాహ్నం 12.35 గంటలకు ముద్దుకృష్ణమ భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాద్‌ నుంచి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ముద్దుకృష్ణమ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాట్రామాపురానికి ఆయన భౌతికకాయాన్ని రోడ్డుమార్గాన అంబులెన్సులో తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు వెంకట్రామాపురం చేరుకొని ముద్దుకృష్ణమకు నివాళులర్పించారు.