కాంగ్రెస్ వల్లే విభజన సమస్యలు : ప్రధాని

కాంగ్రెస్ వల్లే విభజన సమస్యలు : ప్రధాని

07-02-2018

కాంగ్రెస్ వల్లే విభజన సమస్యలు : ప్రధాని

ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ విభజించిన తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఏపీనే కాదు దేశానికి కూడా మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని అన్నారు. అప్పుడు ఏ రాష్ట్రానికి ఇలాంటి అన్యాయం జరగలేదని, ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇవ్వడం వల్ల అప్పట్లో సమస్య రాలేదని, అలాంటి మహోన్నత చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని మోదీ గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంట్‌ తలుపులు మూసి హడావుడిగా ఏపీని విభజించిందని ఆరోపించారు.

రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందనే తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చామని తెలిపారు. ఏపీకి అండగా ఉంటామని చెప్పారు. టీడీపీ ఎంపీల ఆందోళనపై నేరుగా కామెంట్‌ చేయని ప్రధాని మోదీ, సభా కార్యక్రమాలకు అడ్డు తగలాలని ఎవరు అనుకున్నా పార్లమెంట్‌కు అది శ్రేయస్కరం కాదని హితవు పలికారు. మోదీ ప్రసంగం ప్రారంభం కాక ముందే వైసీపీ వెంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు.