రాజధాని ప్రాంతంలో 14 మెడికల్ కళాశాలలు

రాజధాని ప్రాంతంలో 14 మెడికల్ కళాశాలలు

07-02-2018

రాజధాని ప్రాంతంలో 14 మెడికల్ కళాశాలలు

రాజధాని ప్రాంతంలో 14 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  మంగళగిరి మండలం కురగళ్లులో అమృత విద్యాపీఠం, అమరావతి క్యాంపస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్‌ కళాశాలలకు రూ.34 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాలకు రూ.15,900 కోట్లు, పరిపాలనా నగరానికి రూ.9,600 కోట్లు, కొండవీటి వాగు వరద నివారణకు రూ.1,450 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో 10-15 నిమిషాల నడక దూరంలోనే ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాజధానిలో 1600 కి.మీ. సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.