సీఎం చంద్రబాబుకు మరోసారి ఫోన్ చేసిన రాజ్ నాథ్

సీఎం చంద్రబాబుకు మరోసారి ఫోన్ చేసిన రాజ్ నాథ్

07-02-2018

సీఎం చంద్రబాబుకు మరోసారి ఫోన్ చేసిన రాజ్ నాథ్

విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర మరోసారి స్పందించింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అనంతకుమార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్‌లో మంతనాలు జరిపారు. విభజన హామీల అమలుకు సంబంధించిన ఏపీకి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో ప్రధాని ప్రసంగించే సమయంలో ఎంపీలు ఆందోళన చేయకుండా చూడాలని కోరారు.  దీనిపై స్పందించిన చంద్రబాబు కేంద్రం నుంచి సృష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించలేమని సృష్టం చేసినట్లు సమాచారం.