అందరూ కలిసి మాకు న్యాయం చేయాలి : చంద్రబాబు

అందరూ కలిసి మాకు న్యాయం చేయాలి : చంద్రబాబు

07-02-2018

అందరూ కలిసి మాకు న్యాయం చేయాలి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో 6 నెలలపాటు పార్లమెంటులో పోరాటం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తక్కువ మంది ఎంపీలతోనే ఆనాడు సభను స్తంభింపచేశామని, అన్యాయాన్ని ప్రతిఘటించామన్నారు. ప్రజా ప్రయోజనాలే మనకు ముఖ్యం. రాష్ట్రాభివృద్ధే మన లక్ష్యం అని ఎంపీలకు సూచించారు. ఏ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలని, సభ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని అందరూ వినాలన్నారు. అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని, రెండు ప్రభుత్వాల మధ్య సమస్య ఇది అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే బంద్‌ల ద్వారా జనజీవనానికి ఇబ్బందులు కల్పించడం మంచిది కాదని ఆయన విపక్షాలకు సూచించారు.