ఏపీలో పెట్టుబడులు పెట్టండి

ఏపీలో పెట్టుబడులు పెట్టండి

07-02-2018

ఏపీలో పెట్టుబడులు పెట్టండి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి జర్మనీ పారిశ్రామికవేత్తలను కోరారు. మంగళవారం బెర్లిన్‌లో హర్బర్‌, అప్లప్‌ ఆటో సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తురింజన్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బెంజమిన్‌ను కలిసిన అమర్‌నాథ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు. ఈ ఏడాది ఆగస్టులో తమ రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రితో కలిసి అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారని బెంజమిన్‌ మంత్రికి హామ ఇచ్చారు.