అమరావతిలో బౌద్ధ ఆలయ నిర్మాణం

అమరావతిలో బౌద్ధ ఆలయ నిర్మాణం

07-02-2018

అమరావతిలో బౌద్ధ ఆలయ నిర్మాణం

పూర్వం బౌద్ధ మతానికి ముఖ్య కేంద్రంగా నిలిచిన అమరావతిలో బౌద్ధ ఆలయం నిర్మించేందుకు థాయ్‌లాండ్‌ బృందం ముందుకొచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన బృంద సభ్యులు విశాఖపట్నం లేదా విజయవాడ నుంచి త్వరలో థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బౌద్ధ ఆలయ నిర్మాణానికి పదెకరాలు కేటాయిస్తామని, అందుకు అవసరమైన ఆకృతులు రూపొందించాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. విజయవాడ నుంచి విమానాశ్రయ సర్వీసులు నడపాలని కోరారు.