రామమందిరం కోసమే ఓటేశారు
Sailaja Reddy Alluddu

రామమందిరం కోసమే ఓటేశారు

13-03-2017

రామమందిరం కోసమే ఓటేశారు

అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం వేసిన ఓట్లే ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ బ్రహ్మాండమైన విజయం సాధించడానికి దోహదం చేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎమ్‌.జి.వైద్య తెలిపారు. బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో రామ మందిరం నిర్మాణాంశం కూడా ఉందని తెలిపారు. యూపీలో బీజేపీ గెలుపును మందిర నిర్మాణం కోసం ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ మందిర నిర్మాణ ప్రాంతం వివాదస్పద స్థలో ఉందన్నారు. అసలు విషయంలో తవ్వకాల్లో బయటపడుతుందని చెప్పారు. ఈ సమస్య సుప్రీం కోర్టులో పరిష్కారం కాకపోతే ఎన్డీయే ప్రభుత్వం ఆయోద్య లో రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయాలని కోరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకున్న మరుసటి  రోజే వైద్య ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.