ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు : సురేష్ ప్రభు

ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు : సురేష్ ప్రభు

18-01-2018

ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు : సురేష్ ప్రభు

ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా ఆంధ్రప్రదేశ్‌వైపు ఆసక్తిగా చూస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే వేగవంతమైన వృద్ధితో దూసుకెళ్తోందని వెల్లడించారు. అందుకే రష్యా, అబుదాబి ఎక్కడికెళ్లినా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 24, 25,26 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 24వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. హాజరైన 30 దేశాల ప్రతినిధులనుద్దేశించి  మాట్లాడారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టే ఏపీలో ఆరోసారి సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. వ్యవసాయం, తయారీ, సేవారంగాల్లో అద్భుత ప్రతిభ చూపుతోంది. చంద్రబాబు దృఢమైన నాయకత్వంలో సాధ్యమైనంత తక్కువ సమయంలో పరిశ్రమలకు అనుమతులిస్తున్నారు. అందుకే అది ఇప్పుడు దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది.