'గ్లోకల్ లీడర్' చంద్రబాబు

'గ్లోకల్ లీడర్' చంద్రబాబు

18-01-2018

'గ్లోకల్ లీడర్' చంద్రబాబు

లోకల్‌గా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడం. గ్లోబల్‌గా రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలపడం. ఈ రెండు కలిపి గ్లోకల్‌ నాయకుడుగా చంద్రబాబు ఎదిగారంటూ బ్రిటీష్‌ ప్రచురణ సంస్థ బ్లూమ్స్‌ బెర్రీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. చంద్రబాబు నాయుడు -ఇండియాస్‌ గ్లోకల్‌ లీడర్‌ అనే ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చేతనే ఆవిష్కరింపచేయాలని భావించారు. కానీ, సమయం కుదరకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఈ పుస్తకాన్ని పాఠకులకు, చంద్రబాబు అభిమానులకు అందించాలన్న ఉద్దేశ్యంతో మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టారు. గ్లోబల్‌, లోకల్‌ అనే రెండు పదాలను కలిపి గ్లోకల్‌ అనే కొత్త పదాన్ని ఉపయోగించారు.