విజయవంతంగా ముగిసిన జన్మభూమి : చంద్రబాబు

విజయవంతంగా ముగిసిన జన్మభూమి : చంద్రబాబు

12-01-2018

విజయవంతంగా ముగిసిన జన్మభూమి : చంద్రబాబు

ఐదవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం గురువారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని, తనకు ఎంతగానో సంతృప్తినిచ్చిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మభూమిని విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్మమంత్రి అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం దేశంలో మరెక్కాడా జరగలేదని అన్నారు. ఈ మహత్కార్యంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి జన్మభూమి కార్యక్రమం ద్వారా పరిపాలన యంత్రాంగంపై ప్రజలలో సానుకూల ధోరణి రావడం విశేషమని అన్నారు. పదిరోజులు నిర్వహించిన ఈ  కార్యక్రమం ప్రజానీకంలో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించిందని తెలిపారు. ఫించన్లు ఎన్ని లక్షల మందికి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఎంతమంది అర్హులకు అందిస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు.