విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు

విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు

12-01-2018

విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు

విశాఖ నగరం మరో ప్రపంచస్థాయి సదస్సుకు వేదిక కానుంది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు విశాఖలో జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, ఎలీప్‌ సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి విడుదల చేశారు. విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహించడం గొప్ప విషయమని రాష్ట్రంలో ఇంటర్‌నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని మంత్రి తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు పాటుపడుతుండటంతో పాటు మార్కెటింగ్‌ సులువుగా చేసుకునేలా ప్రోత్సహిస్తామని ఎలీప్‌ అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు సార్క్‌ దేశాల నుంచి 70 మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.