భూమా నాగిరెడ్డి మృతికి ప్రముఖుల సంతాపం

భూమా నాగిరెడ్డి మృతికి ప్రముఖుల సంతాపం

13-03-2017

భూమా నాగిరెడ్డి మృతికి ప్రముఖుల సంతాపం

నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని, కర్నూలు జిల్లా అత్యంత ప్రజాదరణ ఉన్న నేతను కోల్పోయిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  భూమా నాగిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని, భూమా మృతి వ్యక్తిగతంగా తనకు, తెలుగుదేశం పార్టీకి, కర్నూలు జిల్లా ప్రజలకు తీరని లోటుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదే విధంగా భూమా నాగిరెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకమృష్ణుడు,  ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్య , హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు,  తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు పలువురు సంతాపం ప్రకటించారు.