అమెరికా వర్సిటీతో నాగార్జున విశ్వవిద్యాలయం ఒప్పందం
Ramakrishna

అమెరికా వర్సిటీతో నాగార్జున విశ్వవిద్యాలయం ఒప్పందం

11-03-2017

అమెరికా వర్సిటీతో నాగార్జున విశ్వవిద్యాలయం ఒప్పందం

అమెరికాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌తో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం చేసుకుంది. దీనిద్వారా నాగార్జున వర్సిటీ ఇంజీనీరింగ్‌ కళాశాలలో రెండు సంవత్సరాల ఎంఎస్‌ ప్రోగ్రాం అందుబాటులోకి రానుంది. విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌ ఆచార్య జాన్‌పాల్‌, ఇంజినీరింగ్‌ కశాశాల ప్రధానాచార్యులు శ్రీనివాసరెడ్డి, స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రతినిధి టెక్‌సిమ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ  ఒప్పందంలో భాగంగా అమెరికాలో ఎంఎస్‌ చేసే విద్యార్థులకు తొలి ఏడాది ఏఎన్‌యూలోనే బోధిస్తారు. రెండో సంవత్సరం అమెరికాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌లో చదవాల్సి ఉంటుంది. ఎంఎస్‌ ధ్రువీకరణ పత్రం కూడా ఆదే విశ్వవిద్యాలయం అందించనుంది.