వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : లక్ష్మీపార్వతి

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : లక్ష్మీపార్వతి

03-01-2018

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : లక్ష్మీపార్వతి

వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాడు రాజకీయాల్లో చంద్రబాబునాయుడును ఎదిరించి పాతపట్నం ప్రజలు తనను గెలిపించారని అన్నారు. అటువంటి రాజకీయాలు ఇప్పుడు లేవని అందుకే ఎన్నికల్లో పోటీ చేయబోనని సృష్టం చేశారు. తన సేవలు వైసీపీకి ఉంటాయని వెల్లడించారు.