ట్రంప్ నిర్ణయం వెనుక భారత్ హస్తం!

ట్రంప్ నిర్ణయం వెనుక భారత్ హస్తం!

02-01-2018

ట్రంప్ నిర్ణయం వెనుక భారత్ హస్తం!

జమాత్‌ ఉద్‌ దవా (జేయూడీ) చీఫ్‌, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. పాకిస్తాన్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వెనుక భారత్‌ హస్తం ఉందంటూ ఆరోపించాడు. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్‌ ఏకాకిగా మారడం, 255 మిలియన్‌ డాలర్ల అమెరికా సాయం నిలిచిపోయిన నేపథ్యంలోనే హఫీజ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్తాన్‌ పచ్చిమోసకారి అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే, ఆదేశానికి అమెరికా పంపించే 255 మిలియన్‌ డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రకటించింది. 15 ఏళ్లుగా అమెరికా పాకిస్తాన్‌కు దాదాపు 33 బిలియన్‌ డాలర్లు సాయం చేసిందనీ, దీన్ని వాడుకుని పాకిస్తాన్‌ అబద్దాలు చెప్పడం తప్ప ఏమాత్రం ఒరిగింది లేదని ట్రంప్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.