చిత్తూరు ఏఎస్పీ మరో రికార్డు

చిత్తూరు ఏఎస్పీ మరో రికార్డు

02-01-2018

చిత్తూరు ఏఎస్పీ మరో రికార్డు

చిత్తూరు ఏఎస్పీ జీఆర్‌ రాధిక పర్వత శిఖరాల అధిరోహణలో మరో మైలురాయిని అధిగమించారు. ఇప్పటికే ప్రపంచంలోని 4 ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన ఆమె తాజాగా దక్షిణ అమెరికాలో 6962 మీటర్ల ఎత్తున్న మౌంట్‌ అకొన్‌కొగానోను అధిరోహించి రికార్డు సృష్టించారు. భారత కాలమానం ప్రకారం డిసెంబరు 30వ తేదీ సాయంత్రం 3:55 గంటలకు అమె అకోన్‌కోగావో పర్వత శిఖరాన్ని అధిరోహించి, అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘనత దేశానికే గర్వకారణమని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు కొనియాడారు.