నిహారికకు అమెరికా ఫెలోషిప్‌

నిహారికకు అమెరికా ఫెలోషిప్‌

01-01-2018

నిహారికకు అమెరికా ఫెలోషిప్‌

వరంగల్‌ రూరల్‌ గీసుకొండ మండలం గొర్రెకుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు తౌటం నిహారిక అమెరికా ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. అమెరికా ప్రభుత్వం 2011 నుంచి పుల్‌ బ్రైట్స్‌ కమిషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్‌ అందజేస్తోంది. దేశవ్యాప్తంగా నలుగురు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి నిహారిక ఉన్నారు. ఫెలోషిప్‌ కింద జనవరి 3 నుంచి మే 14 వరకు నిహారికకు అమెరికాలో శిక్షణ ఇస్తారు. ఫెలోషిప్‌కు ఎంపిక మిగిలిన వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందించాలని ఆమె కోరారు.