అ అర్హతా నాకు లేదు : ఉపరాష్ట్రపతి

అ అర్హతా నాకు లేదు : ఉపరాష్ట్రపతి

01-01-2018

అ అర్హతా నాకు లేదు : ఉపరాష్ట్రపతి

ప్రధానమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సృష్టం చేశారు. ఆ అర్హత కూడా తనకు లేదని చెప్పారు. దేశంలోనే రాజ్యాంగపరంగా రెండో అత్యున్నత పదవి దక్కిందని, ఇంతుకుమించిన కోరికలు తనకు లేదన్నారు. నూతన సంవత్సరం తొలిరోజున పుస్తక మహోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అనేక సంస్కరణలు అమలుచేస్తున్నారని, రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. మదనపల్లిలో పండించిన టమాటా, మహారాష్ట్రలో పండిన ఆలూ, అన్నింటికీ ధర రావాలన్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి, ఉగాది ఏదైనా అప్పటి నుంచి ప్రజలు సానుకూల దృక్పథం అలవరుచోవాలని వెంకయ్య పిలుపిచ్చారు. ప్రజలు, పత్రికలు సానుకూల దృక్పథంలో ఉండాలన్నారు. సానుకూలం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనికీ తలూపాలని కాదని, దేశం, సమాజం, అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉండడమని చెప్పారు.