కొత్త సంవత్సరంలో ప్రజలకు విజయాలు చేకూరాలి : మంత్రి లోకేష్‌

కొత్త సంవత్సరంలో ప్రజలకు విజయాలు చేకూరాలి : మంత్రి లోకేష్‌

01-01-2018

కొత్త సంవత్సరంలో ప్రజలకు విజయాలు చేకూరాలి : మంత్రి లోకేష్‌

దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికి, ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2018లో ప్రజలందరికి శుభాలు జరగాలని, విజయాలు చేకూరాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమనామ సంవత్సరంగా 2017 చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వ్యవసాయం,  సంక్షేమం మరియు పారిశ్రామిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి జరగాలన్నారు. నూతన మార్పులకు 2018లో నాంది పలకాలని ఆకాంక్షించారు.