భారతదేశానికి ఆంధ్రులు మార్గదర్శకం

భారతదేశానికి ఆంధ్రులు మార్గదర్శకం

30-12-2017

భారతదేశానికి ఆంధ్రులు మార్గదర్శకం

భారతదేశానికి ఆంధ్రులు మార్గదర్శకం కావాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌ 2018 సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం తెలుగువారికి గౌరవం పెరిగిందని, తెలుగు ఖ్యాతిని తెలుగువారు మరింత పెంచాలని అన్నారు. తెలుగువారి కోసం ఆంధ్రా అసోసియేషన్‌ పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తెలుగును, విలువలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారు విడిపోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార హక్కు కమినర్‌ మాడభూషి శ్రీధర్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌  పాల్గొన్నారు.