మంత్రి కేటీఆర్‌కు అమెరికా రాయబారి అభినందన

మంత్రి కేటీఆర్‌కు అమెరికా రాయబారి అభినందన

30-12-2017

మంత్రి కేటీఆర్‌కు అమెరికా రాయబారి అభినందన

హైదరాబాద్‌ నగరంలో గ్లోబల్‌ ఆంత్ర ప్రిన్యూర్‌షిప్‌ (జీఈఎస్‌) సదస్సును అద్భుతంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్‌ను అభినందిస్తూ భారత్‌లో అమెరికా అంబాసిడర్‌ కెన్నెత్‌ ఐ.జస్టర్‌ రాసిన లేఖలో ప్రశంసించారు. ప్రత్యేక చొరవ తీసుకుని సదస్సు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విశేష కృషి చేశారని కేటీఆర్‌ను కొనియాడారు. జీఈఎస్‌ సదస్సును ఆశించిన దానికన్నా మరింత అద్భుతంగా నిర్వహించి తనను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం వల్లనే సదస్సు విజయవంతంగా జరిగిందని కితాబినిచ్చారు. తెలంగాణ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు అద్భుతమని ఆయన కొనియాడారు.