తెలుగు రాష్ట్రాలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

తెలుగు రాష్ట్రాలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

29-12-2017

తెలుగు రాష్ట్రాలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. గోవింద నామ స్మరణ చేసుకుంటూ చలిని సైతం లెక్క చేయకుండా వైకుంఠనాథుడిని దర్శించుకున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు కొండపైకి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించినా వేలాది మంది క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ దాటి సుమారు రెండు కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సినీనటుడు మోహన్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు శ్రీవారిని దర్శించుకున్నారు.

చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల, కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం, నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయం, కృష్ణా జిల్లా మైలవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, గుంటూరులోని వెంకటేశ్వర ఆలయం సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వైష్టవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణలో వైష్టవ ఆలయాలు సందడిగా మారాయి. ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, యాదాద్రి నరసింహ ఆలయం, భద్రాచలంలోని రామాలయం, హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ టీటీడీ ఆలయం, జియాగూడలోని రంగనాథస్వామి ఆలయం, శ్రీనగర్‌లోని వెంకటేశ్వర ఆలయం సహా రాష్ట్రవ్యాప్తంగా వైష్టవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.