ఆర్కే నగర్‌ ఎమ్మెల్యేగా దినకరన్‌ ప్రమాణస్వీకారం
MarinaSkies
Kizen

ఆర్కే నగర్‌ ఎమ్మెల్యేగా దినకరన్‌ ప్రమాణస్వీకారం

29-12-2017

ఆర్కే నగర్‌ ఎమ్మెల్యేగా దినకరన్‌ ప్రమాణస్వీకారం

తమిళనాడు ఆర్కే నగర్‌ నియోజకవర్గం నంచి గెలుపొందిన టీటీవీ దినకరన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ధన్‌పాల్‌ ఆయన కార్యాలయంలో దినకరన్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌పై దినకరన్‌ 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దినకరన్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో అన్నాడీఎంకే నుంచి తొలగింపబడ్డ తంగతమిళ్‌ సెల్వన్‌, కలైరంజన్‌, వట్రివేల్‌, పార్థీబన్‌తో పాటు పలువురు నేతలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఆర్కేనగర్‌లో పర్యటించనున్నారు.