మిథాలీ రాజ్‌కు తెలంగాణ సర్కార్‌ నజరానా

మిథాలీ రాజ్‌కు తెలంగాణ సర్కార్‌ నజరానా

29-12-2017

మిథాలీ రాజ్‌కు తెలంగాణ సర్కార్‌ నజరానా

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల చెక్‌ను అందజేసింది. నగదుతోపాటు బంజారాహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా హైదరాబాదీ క్రికెటర్‌కు కేటాయించింది. మిథాలీ సారథ్యంలోకి మహిళ జట్టు 2017లో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చేరింది. 9 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో ఓడనప్పటికీ, మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు నెలకొల్పింది. రెండు వరల్డ్‌ కప్‌లలో భారత జట్టుకు సారథ్యం వహించిన ఏకైక కెప్టెన్‌ మిథాలీనే కావడం విశేషం. 2005, 20017లో ఆమె ఈ ఘనత సాధించింది. పురుషుల క్రికెట్లోనూ మారే భారత కెప్టెన్‌కు ఇది సాధ్యం కాలేదు.