బెంగళూరులో ఇండియా సాఫ్ట్‌ 2018 ప్రదర్శన

బెంగళూరులో ఇండియా సాఫ్ట్‌ 2018 ప్రదర్శన

29-12-2017

బెంగళూరులో ఇండియా సాఫ్ట్‌ 2018 ప్రదర్శన

ఇండియా సిలికాన్‌వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో జనవరి 24 నుంచి 25వ తేదీ వరకు ఇండియా సాఫ్ట్‌ 2018 ప్రదర్శన జరుగుతున్నట్లు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఇఎస్‌సి) చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి తెలిపారు. 24వ తేదీ ఉదయం 8.30 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. తొలిరోజున కేంద్ర ఐటీశాఖ సెక్రటరీ అజయ్‌ ప్రకాష్‌ సాహ్నే కీనోట్‌ ప్రసంగం చేస్తారు. కేంద్ర పరిశ్రమలశాఖ సెక్రటరీ రీటా టియోటియా, కర్ణాటక ఐటీ,బిటి,ఎస్‌టి డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ గౌరవ్‌ గుప్తా, కర్ణాటక ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు, కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంకఖర్గే తదితరులు ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు.