భూమా మృతి పట్ల పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రద్ధాంజలి

భూమా మృతి పట్ల పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రద్ధాంజలి

13-03-2017

భూమా మృతి పట్ల పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రద్ధాంజలి

నంద్యాల శానససభ్యులు భూమా నాగిరెడ్డి మృతిచెందడం పట్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరులో ఏర్పాటు చేసిన భేటీకి పలువురు శానససభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి మృతి వార్తను విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాప సూచికంగా మౌనం పాటించారు. ఈ సందర్బంగా భూమా నాగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశాన్ని రద్దు చేశారు. టిడిపి కుటుంబ సభ్యుడిగా భావించే నాగిరెడ్డి మృతిని తమను కలిచివేసిందన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి భూమా నాగిరెడ్డి కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి మృతి రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు.