పూరీలో ఎంపి కవిత సైకత శిల్పం
Sailaja Reddy Alluddu

పూరీలో ఎంపి కవిత సైకత శిల్పం

13-03-2017

పూరీలో ఎంపి కవిత  సైకత శిల్పం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదిన్సోవాన్ని పురస్కరించుకొని ఒడిషాలోని పూరీలో కవిత సైకత శిల్పం వెలిసింది. జాగృతి వరంగల్‌ అర్బన్‌ అధ్యక్షులు కొరబోయిన విజయ్‌ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శిల్పి జితేందర్‌ సాహు ఇసుక ఆకృతిలో  హ్యాపీ బర్డ్‌డే కవితాజీ పేరుతో కవిత సైకత శిల్పాన్ని రూపొందించారు. దీనిని ఆరుగురు సహాయకులతో రూపొందించిన సైకత శిల్పం వద్ద ఫొటోలు దిగేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. ఈ నెల 13(సోమవారం )కవిత జన్మదినం.