సైబరాబాద్‌ ఘనత చంద్రబాబుదే

సైబరాబాద్‌ ఘనత చంద్రబాబుదే

15-12-2017

సైబరాబాద్‌ ఘనత చంద్రబాబుదే

ఐటీ పరంగా హైదరాబాద్‌ సాధించిన అభివృద్ధి ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్‌ మహీంద్రలో జరిగిన మిషన్‌ ఇన్నోవేషన్‌-2018లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గత 17 ఏళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. ప్రపంచంలోనే టాప్‌-5 కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు ప్రారంభించాయి. ఆ ఘనత నాది కాదు. నగరంలో మెక్రోసాఫ్ట్‌ ఏర్పాటు ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. హైదరాబాద్‌ ఐటీ కి ఏ మాత్రం పేరులేని రోజుల్లో ఆయన అమెరికా వెళ్లి ఇక్కడ కంపెనీని స్థాపించేలా బిల్‌గేట్స్‌ను ఒప్పించారు. ఐటీ అభివృద్ధికి బాబు విశేషంగా కృషి చేశారు. చేయాల్సిందంతా చేశారు అని కొనియాడారు. క్రెడిట్‌ గోస్‌ టూ అని కేటీఆర్‌ చెబుతుండగా, టేక్‌ మహీంద్ర సీఈవో గుర్నానీ మధ్యలో అందుకొని సద్య నాదేళ్ల అన్నారు. వెంటనే కేటీఆర్‌ అడ్డుకొని లేదు లేదు చంద్రబాబుదే అన్నారు.