పోలవరాన్ని సందర్శించిన పవన్‌
Ramakrishna

పోలవరాన్ని సందర్శించిన పవన్‌

07-12-2017

పోలవరాన్ని సందర్శించిన పవన్‌

సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాజమహేంద్రవరం నుంచి కారులో పోలవరం చేరుకున్న పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హిల్‌ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఎస్‌ఈ వి.రమేష్‌బాబు ఆయనకు వివరించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు వివరించారు. పవన్‌ పర్యటన పురస్కరించుకొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.