సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా కోటిరెడ్డి

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా కోటిరెడ్డి

10-11-2017

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా కోటిరెడ్డి

సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షుడిగా కొమ్మిరెడ్డి కోటిరెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల 41వ వార్షిక సర్వ సభ్య సాధారణ సమావేశంలో 2017-19కి జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. రెండు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 3వేల మంది సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన కార్యవర్గంలో కార్యదర్శిగా చిర్ల సత్య, కోశాధికారిగా సత్య సూరిశెట్టి, ఉపాధ్యక్షులుగా టెకూరి నగేష్‌, జ్యోతీశ్వర్‌, రామలింగేశ్వర్‌, వినయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, వాటిని భావితరాలకు అందించడమే తన కర్తవ్యమన్నారు.