ఐదేండ్లలో రూ.లక్షా 25వేల కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యం

ఐదేండ్లలో రూ.లక్షా 25వేల కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యం

10-11-2017

ఐదేండ్లలో రూ.లక్షా 25వేల కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యం

రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ కాబోతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. టీహబ్-1 విజయవంతమయ్యిందని, అదే ఉత్సాహంతో టీహబ్-2కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.  తాము బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం నుంచి ఏటా రూ.57వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు ఉండగా, రాబోయే ఐదేండ్లలో ఎగుమతులు ఏటా రూ.లక్షా 25వేల కోట్లకు చేరుకోవాలని ఆనాడే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆ లక్ష్యాన్ని చేరుతామని ధీమా వ్యక్తంచేశారు. 2015-16లో ఐటీ ఎగుమతుల విలువ రూ.75,070 కోట్లు ఉండగా, 2016-17లో 13.85% వృద్ధిరేటుతో రూ. 85,470 కోట్లకు పెరిగాయి. భారతదేశంలోనే తొలిసారిగా నిర్వహించబోతున్న వరల్డ్ కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమని కేటీఆర్ అన్నారు.