మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్, కేటీఆర్

మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్, కేటీఆర్

09-11-2017

మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్, కేటీఆర్

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌లు బుధవారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు. గవర్నర్‌తో పాటు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ శేఖర్‌ ప్రసాద్‌ సింగ్‌, మున్సిపల్‌ సెక్రటరీ నవిన్‌ మిట్టల్‌ పలువురు అధికారులు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు పారంభం కానున్న సంగతి తెల్సిందే.