ఢిల్లీలో మళ్లీ సరి బేసి విధానం

ఢిల్లీలో మళ్లీ సరి బేసి విధానం

09-11-2017

ఢిల్లీలో మళ్లీ సరి బేసి విధానం

దేశ రాజధాని ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో ఈ నెల 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు సరి బేసి వాహన విధానాన్ని అమలు చేయనున్నట్లు ఢిల్లీ రవాణ శాఖ మత్రి అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సరి-బేసి వాహన విధానం కింద ప్రైవేటు వాహనదారులు తమ వాహనాల నంబర్‌ ప్లేట్‌ లపై ఉన్న చివరి నంబర్‌ తమ వాహనాలను రోడ్డుపైకి తీసుకురావాలసి ఉంటుందని ఆయన వివరించారు. సరి సంఖ్య నంబర్‌ ఉన్న కార్లను బేసి తేదీ రోజున రోడ్డపైకి తీసుకురావడానికి అనుమతిస్తామనీ, అలాగే బీసీ సంఖ్య ఉన్న కార్లను సరి సంఖ్య తేదీ ఉన్న రోజున మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తామని తెలిపారు.