అమెరికాను మించిన బెంగళూరు

అమెరికాను మించిన బెంగళూరు

09-11-2017

అమెరికాను మించిన బెంగళూరు

ఉన్నదాంతోనే ఆధునికతను చాటుకొనే కళలో బెంగళూరువాసులు ఆరితేరారు. ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం బెంగళరువాసులకు వ్యాపార విశ్వాసం చాలా ఎక్కువగా ఉందని తేలింది. ఈ నివేదికను రూపొందించిన డెనిస్‌ మెక్‌కాలే తెలిపిన వివరాల ప్రకారం తమకు అందుబాటులో ఉన్న నైపుణ్యం మౌలిక సదుపాయాలతోనే డిజిటల్‌ లావాదేవీలకు మారడంలో బెంగళూరు వ్యాపార దిగ్గజాలు చురుగ్గా వ్యవహరించారని వెల్లడైంది. కాన్ఫిడెన్స్‌ ఆఫ్‌ బిజినెస్సెస్‌లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోను మించిపోయి బెంగళూరు ప్రథమ స్థాయిలో నిలిచింది. శాన్‌ఫ్రాన్సిస్కో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడు, నాలుగు స్థానాల్లో ముంబై, న్యూఢిల్లీ నిలిచాయి. ఇన్నోవేషన్‌, ఎంటర్‌ ప్రెన్యూవర్‌షిప్‌, మానవ వనరులు, నైపుణ్యాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక పరిస్థితులు, ఐసీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పట్ల బెంగళూరు బిజినెస్‌ లీడర్లు సమున్నత నమ్మకాన్ని వ్యక్తం చేసినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. వీటిలోని ప్రతి అంశంలోనూ బెంగళూరు నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది.