90వ పడిలోకి అద్వానీ

90వ పడిలోకి అద్వానీ

09-11-2017

90వ పడిలోకి అద్వానీ

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉపప్రధానమంత్రి లాల్‌కృష్ణ అద్వానీ 90వ పడిలోకి అడుగిడారు. ఫృధ్వీరాజ్‌ రోడ్‌లో గల తన నివాసంలో అంధ పాఠశాలకు చెందిన 90 మంది విద్యార్థులు ప్రత్యేక అతిథులుగా విచ్చేయగా వారితో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆ చిన్నారులకు తన ఇంట్లో ఆహారాన్ని స్యయంగా వడ్డించి, వారితో కలిసి తాను కూడా ఆరగించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, అద్వానీ ఇంటికివెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులు అద్వానీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆయన ఆయురాగ్యోలతో జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.