అర్హులైన పేద‌లంద‌రికి ఇళ్లు : జ‌గ‌న్

అర్హులైన పేద‌లంద‌రికి ఇళ్లు : జ‌గ‌న్

07-11-2017

అర్హులైన పేద‌లంద‌రికి ఇళ్లు : జ‌గ‌న్

క‌డ‌ప జిల్లాలో రెండో రోజు వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. వేంప‌ల్లిలో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి మాట్లాడిన జ‌గ‌న్ వారి స‌మ‌స్య‌ల ‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ప్ర‌ జ‌లనుద్దేశించి మాట్లాడిన జ‌గ‌న్ .. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌కు ఉచితంగా విద్యుత్ అందిస్తామ‌ని తెలిపారు. అర్హులైన పేద‌లంద‌రికీ ఉచితంగా ఇళ్లు ఇవ్వ‌డంతో పాటు.. ప్ర‌స్తుతం వెయ్యి ఉన్న పెన్ష‌న్ రూ. 2 వేల‌కు పెంచుతామ‌ని అన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ల‌క్షా 42వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.